Subscribe

శరన్నవరాత్రి ఉత్సవములు - శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి



శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్

శరన్నవరాత్రి ఉత్సవములలో రెండొవ రోజు దుర్గమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురిని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము. మనస్సు, బుధ్ధి, చిత్తము, అహంకారము త్రిపుర సుందరీదేవి అధీనములో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. నిత్య సంతోషము కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రములోని త్రిపురాత్రయములో మోదటి దేవత. కనుక ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహము కోసము బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్ళలోపు బాలికలను అమ్మవారి స్వరూపముగా భావించి పూజ చేసి క్రొత్త బట్టలు పెట్టాలి.

ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః  అనే మంత్రాన్ని 108 మార్లు జపించాలి.

త్రిశతీ పారాయణ చేసి అమ్మవారికి పాయసము నివేదన చెయ్యలి.

శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము విషయ సూచిక నందు లభించును.
శ్రీ త్రిపురసుందరీ స్తోత్రము  విషయ సూచిక నందు లభించును.
బాలా స్తుతి

ఆయీ ఆనన్దవల్లీ అమృతకర తల్లీ ఆదిశక్తీ పరాయీ
మాయా మాయా స్వరూపీ స్ఫటికమణిమయీ మాతంగీ షడంగీ
ఙ్ఞానీ ఙ్ఞానస్వరూపీ నళిన పరిమళీ నాద ఓంకార యోగీ
యోగీ యోగాసనస్థా భువనవశకరీ సౌన్దరీ ఐం నమస్తే

బాలా మన్త్రే  కటాక్షీ మమహృదయసఖీ ముక్తభావ ప్రచండీ
వ్యాళీ యఙ్ఞోపవీతే వికట కటి తటీ వీరశక్తీ ప్రసాదీ
బాలే బాలేన్దుమౌళే మదగజభుజహస్తాభిషేక్త్రీ స్వతన్త్రీ
కాళీ త్వాం కాలరూపీ ఖగ గలన హృదీ, కారణీ క్లీం నమస్తే  

మూలాధారే మహిమ్నీ హుతవహనయనీ మూలమన్త్రీ త్రినేత్రీ
హరాః కేయూరవల్లీ అఖిలసుఖకరీ అంబికాయాః శివాయా
వేదే వేదాన్తరూపీ వితత ఘనతటీ వీరతన్త్రీ భవానీ
శౌరీ సంసార యోనీ సకల గుణమయీ తేద్య శ్రీం సౌః నమస్తే

ఐం క్లీం సౌః సర్వమన్త్రే మమ వరశుభకరీ అంగనా చేష్టితాయా
శ్రీం హ్రీం క్లీం బీజముఖ్యైః దినకర కిరణైః జ్యోతిరూపే శివాఖ్యే
హ్రీం మ్రీం హ్రూం హేమవర్ణే హిమకరకిరణా భాసమానేన్దుచూడే
క్షాం క్షీం క్షూం క్షౌమవాసే సకల జయకరీ శక్తి బాలే నమస్తే  

* * *

శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం

కదంబవన చారిణీం మునికదంబకాదంబినీం
నితంబజితభూధరాం సురనితంబనీసేవితాం
నవాంబురుహలోచనాం అభినంబుదశ్యామలాం
త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే

కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణిం ముఖసముల్లసద్వాసినీం
దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం
త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే

కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాపి ఘనలీలయా కవచితా వయం శిలయా

కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీం
విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం
త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే

కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీం
మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం
మతంగమునికకన్యకాం మధురభాషిణీమాశ్రయే

స్మరేత్ర్పథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం
గృహీతమధుపాత్రికాం మధువిఘూర్ణనేత్రాంచలాం
ఘన స్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోకచన కుటుంబినీం త్రిపురసుందరీం మాశ్రయే

సకుంకుమవిలేపనా మళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షేణాం శరచాప పాశాంకుశాం
ఆశేషజనమోహినీ మరుణ మాల్యభూషాంబరాం
జపాకుసుమభసురాం జపవిదౌస్మరేదంబికం

పురందరపురంధ్రికాచికురబంధ సైరంధ్రికాం
పితామహపతివ్రతాం పటుపటీర చర్చారతాం
ముకుంద రమణీమణీల సదలంక్రీయాకారిణీం
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికాం

ఇతి శ్రీ త్రిపురసుందరీ స్తోత్రం
* * * 
  

*-> మంత్రములు గురుముఖముగా అభ్యసించి జపించవలెను. ఈనాటి సమాజములో మంత్రములకు గోప్య స్థితి కరువై విరివిగా పుస్తకములలో లభ్యమవుతున్నాయి. పుస్తకములలో ముద్రించారుకదా అని జపించటము మొదలు పెడితే అపస్వరములు దొర్లి సాధకునకు చెడు ప్రభావము కలిగే ప్రమాదము ఉన్నది. కనుక మంత్రములు తప్పనిసరిగా గురుముఖముగా అభ్యసించి జపించవలెను. నా వాక్యములు పరుషముగా అనిపించినచో క్షమతుల్యుడను. 
Image & Content Courtesy: Sri Durga Malleswara Swamy Devasthanam

0 comments:

Post a Comment