Subscribe

శరన్నవరాత్రి ఉత్సవములు - శ్రీ దుర్గా దేవి



శ్రీ దుర్గా దేవి

దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపముగా అమ్మవారు నవరాత్రులలో అష్టమి తిథిలో దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారములో అమ్మ దుర్గముడనే రాక్షసుడిని సమ్హరించినట్లు పురాణములు చెబుతున్నాయి.

పంచప్రకృతి స్వరూపములలో ప్రధమమైనది దుర్గారూపము.  భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుబాధలు తొలగిపోతాయి. విజయము కలుగుతుంది. సకల గ్రహ దోషములు అమ్మను పూజించినంతమాత్రమునే ఉపశమింపబడతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి.

పూజా విధానము: ఎర్రని బట్టలు పెట్టి, ఎర్రని అక్షతలతో, ఎర్రని పూలతో అమ్మని పూజించాలి.
మంత్రము: "ఓం దుం దుర్గాయైనమః" అనే మంత్రమును  పఠించాలి.
దుర్గా సూక్తము పారాయణ చేయవలెను.
దుర్గా, లలితా అష్టోత్తరములు పఠించవలెను.
నివేదన: పులగము నివేదన చెయ్యాలి.



పులగము చేసే విధానము







* * *


Image & Content Courtesy: Sri Durga Malleswara Swamy Devasthanamu.

0 comments:

Post a Comment