Subscribe

శరన్నవరాత్రి ఉత్సవములు - శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి



శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి

శరన్నవరాత్రులలోని మొదటి  రోజు దేవిని పసుపు రంగు దుస్తులతో అలంకరిస్తారు. నవరాత్రి అలంకారాలలో తొలి రోజునే కనకదుర్గా దేవిని దర్శించుకున్నవారికి దారిద్ర్య బాధలు మటుమాయము అవుతాయని భక్తుల నమ్మకము.

అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధి యీపుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.

అశ్వనీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కల మాసం ఆశ్వీయుజ మాసం, శరదృతువు ఈ నెలతో ప్రారంభం అవుతుంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు దేశమంతటా భిన్నభిన్న పద్ధతుల్లో జరుగుతాయి. తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలలో దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీ నవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరదృతువులో జరుపుకుంటారు కనుక శరన్నవరాత్రులని కూడా అంటారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారికి కేసరి నైవేద్యం చెయ్యాలి. 

విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగలలో దేవీ నవరాత్రులు అత్యంత ప్రధానమైనవి. శరదృతువులో ఆశ్వియుజ శుధ్ధ పాడ్యమి నుండి నవమి వరకు ఈ వేడుకలు జరుగుతాయి. దేవి అంటే త్రిమూర్తుల తేజం కలగలిసిన మహాశక్తి. విజయవాడ కనకదుర్గ అలంకారాలే రాష్ట్రములోని మిగతా ప్రాంతాలలో కూడా అనుసరిస్తారు.

ఎన్ని కథలున్నా కనకదుర్గగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దేవికి శరన్నవరాత్రుల పేరిట దసరా తొమ్మిది రోజులు ఉత్సవములు నిర్వహించడము అనాదిగా వస్తున్న ఆచారము. ఈ తొమ్మిది రోజులు దేవి ఒక్కో అలంకారముతో భక్తులకు దర్శనమిస్తింది.


శ్రీ దుర్గాష్టకమ్

ఉద్వపయతునశ్శాక్తి మాదిశక్తే ద్దరస్మితమ్
తత్త్వం యస్యమహత్సూక్ష్మం మానన్దోవేతి సంశయః

ఙ్ఞాతుర్ఞానం స్వరూపం స్యాన్నగుణోనాపి చక్రియా
యదిస్వ స్య స్వరూపేణ వైశిష్ట్యమనవస్ధీతిః

దుర్గే భర్గ సంసర్గే సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే నిత్యానందపదేశివా

శివా భవాని రుద్రాణి జీవాత్మపరిశోధినీ
అమ్బా అమ్బిక మాతంగీ పాహిమాం పాహిమాం శివా

దృశ్యతేవిషయాకారా గేహణే స్మరణే చధీః
ప్రఙ్ఞావిషయ తాదాత్మ్య మేవం సాక్షాత్ ప్రదృశ్యతే

పరిణామో యథా స్వప్నః సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్ ప్రపఞ్చ ఏషస్యా త్తథేశ్వర మహాచితః

వికృతి స్సర్వ భూతాని ప్రకృతిర్దుర్గదేవతా
సతః పాదస్తయోరాద్యా త్రిపాదీణీయతేపరా

భూతానామాత్మనస్సర్గే సంహృతౌచతథాత్మని
ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా సఙ్కల్పానారా యథామతిః

ఫలశృతిః
యశ్చాష్టక  మిదం పుణ్యం పాత్రరుథాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా సర్వాన్కామానవాప్నుయాత్ 


    Image Courtesy: Sri Durga Malleswara Swamy Devasthanam
    Content Courtesy: teluguone.com 

      0 comments:

      Post a Comment